మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా మయూరి డాన్స్ అకాడమీ గురువు వైదేహి సుభాష్ శిష్య బృందంచే “నాట్య స్వర మంజరి” భరతనాట్య ప్రదర్శన, వెంకటరామన్ చే పద్య పఠనంమ్ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.

పుష్పాంజలి, తోదయమంగళం నారాయణ వైభవం, మరకతమణిమయ, శివ స్తుతి, మహాదేవ, జావళి, కావడి చిందు అంశాలను వైదేహి, గాయత్రీ, శైలజ, చిన్మయి, శుభశ్రీలు ప్రదర్శించారు.
వెంకటరామన్ భాగవతంలోని గజేంద్ర మోక్షం పద్య పఠనం, శ్రీ భక్త రామదాసు పద్యాలను ఆలపించారు.