చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): ఓ గుర్తు తెలియని వ్యక్తి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. చందానగర్ లోని భారత్ పెట్రోల్ పంప్ ఎదుట ఈ నెల 3వ తేదీన ఓ గుర్తు తెలియని వృద్ధుడు స్పృహ తప్పి పడి ఉన్నాడన్న సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని చికిత్స నిమిత్తం పటాన్‌చెరులోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం అతన్ని మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. కాగా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆ వృద్ధుడు ఈ నెల 7వ తేదీన మృతి చెందాడు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆ వృద్దున్ని గుర్తు పట్ట దలిస్తే 040-27853911, 9490617118, 7901113092 అనే ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
