శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తారానగర్, లింగంపల్లి పార్టీ నాయకులకు సభ్యత్వ నమోదు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో శేరిలింగంపల్లి డివిజన్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముందుండాలని సూచించారు.
