శేరిలింగంపల్లి, మే 6 (నమస్తే శేరిలింగంపల్లి): మదీనాగూడ డివిజన్ పరిధిలోని మదీనగూడ గ్రామానికి చెందిన జై భవాని యూత్ సభ్యులకు బీజేవైఎం రాష్ట్ర నాయకుడు నందనం విష్ణు దత్త్ క్రికెట్ బ్యాట్స్, వాలీబాల్ కిట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు పాలం శ్రీనివాస్, బీజేవైఎం నాయకులు కళ్యాణ్ చౌదరి, వేణు, నరేష్, స్థానిక యువకులు పాల్గొన్నారు.






