వర్షపు నీటి కాలువ నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

శేరిలింగంపల్లి, డిసెంబ‌ర్ 27 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని మహంకాళి నగర్ ఆశా నగర్ హైటెన్ష‌న్ లైన్ రోడ్డు లో నూతనంగా నిర్మిస్తున్న వర్షపు నీటి కాలువ (బాక్స్ డ్రైన్) నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వర్షపు నీటి కాలువ నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు వినియోగంలోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు. అలాగే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా డ్రైనేజీ నిర్మాణ పనులను ముందస్తు ప్రణాళికతో పూర్తి చేయాలని అన్నారు. కార్యక్రమంలో పాండు గౌడ్, పోశెట్టిగౌడ్, దాతి రమేష్, నిరంజన్, సూరిబాబు, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here