శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 26 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో శివరాత్రి పండుగను పురస్కరించుకొని సిద్ధ నాట్య కళా సమితి సుధామాల, వాణి రమణ, రేణుక ప్రభాకర్, చంద్రశేఖర్, అడపా భరణి, నళిని రమణ ఆధ్వర్యంలో నాట్య అంజలి ఉత్సవాన్ని నిర్వహించారు. గురువులు సుందరి రవి చంద్ర, డాక్టర్ పేరిణి కుమార్, హైమావతి, జయ కవి, శిరీష, బాలాజీ, శ్రీవల్లి రావు, నివేదిత, శృతికిరణ్ శిష్య బృందాలు లింగాష్టకం, శివ స్తుతి, భో శంభో, రవాణా కృత శివ తాండవం, శంకర గిరిజ పతి, గంగాధరవర, అంగీకారం భువనం, పంచమూర్తి కౌతం, కాలభైరవాష్టకం అంశాలను ప్రదర్శించి మెప్పించారు. యక్షగాన కంఠీరవ డాక్టర్ పసుమర్తి శేషు బాబు, నాట్య మయూరి డాక్టర్ సత్య ప్రియా ముఖ్య అతిధులుగా విచ్చేసి గురువులను, కళాకారులను అభినందించారు.