మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని వడ్డెర బస్తీలో తలెత్తిన డ్రైనేజ్, మంజీరా పైప్ లైన్ సమస్యను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ బుధవారం పరిశీలించారు. డ్రైనేజీ వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఆయన సమస్యలను పరిశీలించారు. వెంటనే సంబంధిత అధికారులతో ఆయన ఆయా సమస్యలపై మాట్లాడారు. వాటిని తక్షణమే పరిష్కరించేలా చూడాలని అధికారులకు ఆయన సూచించారు.







