శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 28 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని మాదాపూర్ హైటెక్స్ కమాన్ దగ్గరలో నూతనంగా ఏర్పాటు చేసిన హాలీమిస్త్ హలీం దుకాణాన్ని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా హాలీమిస్త్ హలీం దుకాణం యాజమాన్యం మొహ్మద్ మొయినుద్దీన్ కి శుభాభినందనలు తెలియజేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కార్పొరేటర్ హమీద్ పటేల్, సీనియర్ నాయకులు ఇమామ్, సతీష్, బాబా, శేఖర్, అమీనుద్దీన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.