నందమూరి తారక రామారావుకు కార్పొరేటర్ శ్రీకాంత్ ఘ‌న నివాళి

శేరిలింగంపల్లి, జ‌న‌వ‌రి 18 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): న‌టుడు, మాజీ ముఖ్యమంత్రి డా. నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని జయప్రకాష్ నారాయణ్ నగర్ కాలనీలో స్థానికులతో కలిసి ఆయ‌న విగ్రహానికి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర చిరస్థాయిగా వేసుకున్న నాయకుడు, విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, నటరత్న, పద్మ శ్రీ, మాజీ ముఖ్యమంత్రి డా. నందమూరి తారక రామారావు అని తెలియజేశారు. అన్న అనే పదానికి మారుపేరు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని భావించి ప్రజా సంక్షేమానికి సరికొత్త అర్థం చెప్పిన మహానుభావుడు నందమూరి తారకరామారావు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మర్రపు గంగాధర్ రావు, వెంకటేశ్వరావు, మోహన్ రావు, కాట్రగడ్డ సత్యనారాయణ, బసవేశ్వరావు, ఎస్ ఆర్ వెంకటేశ్వరావు, దయానంద్ ముదిరాజ్, సాంబయ్య, చిలుకూరి శ్రీనివాస్, వర్మ , ఉమా, బలరాం, రవికృష్ణ, రాజు, గిరి, నరేంద్ర, కిరణ్, వెంకటేష్ , శివ, హరి బాబు, నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here