శేరిలింగంపల్లి, జనవరి 18 (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్ పల్లి ఎమ్మెల్యే కృష్ణారావును శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గంగారం సంగారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శేరిలింగంపల్లిలో నెలకొన్న పలు సమస్యలపై ఎమ్మెల్యేతో సంగారెడ్డి చర్చించారు. అలాగే తన బయోడేటాను సంగారెడ్డి ఎమ్మెల్యేకి అందజేశారు.






