జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, న‌వంబర్ 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హైదరాబాద్ ట్యాంక్ బండ్ లోని హైదరాబాద్ మహానగర పాలక సంస్థ జిహెచ్ఎంసీ కౌన్సిల్ ప్రస్తుత పాలకవర్గం పదవీ కాలంలో చివరి సమావేశం జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో పలు హైదరాబాద్ ఎమ్మెల్యే లు, జిహెచ్ఎంసీ కార్పొరేటర్లతో కలిసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి డివిజన్ లో ముఖ్యంగా శానిటేషన్ పై దృష్టి సారించాలని, వీధి దీపాలు, crmp రోడ్లు, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత అధికారులను ఆదేశించి తగిన చర్యలు చేపట్టి సాధ్యమైనంత త్వరగా సమస్యలను పరిష్కరించి శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్ధికి సహకరించాలని మేయర్ కి విజ్ఞప్తి చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here