శేరిలింగంపల్లి, నవంబర్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో డెవలప్మెంట్ అఫ్ కమిషనర్ హ్యాండీక్రాఫ్ట్స్, మినిస్ట్రీ అఫ్ టెక్స్‌టైల్స్, గవర్నమెంట్ అఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ సంయుక్త నిర్వహణలో గత పది రోజుల నుండి నిర్వహిస్తున్న గాంధీ శిల్ప బజార్ హస్తకళల ఉత్సవం మంగళవారంతో ముగిసింది. సందర్శకులు హస్తకళా ఉత్పత్తులకు మంచి ఆదరణ చూపించారని హస్తకళాకారులు తెలిపారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా లక్ష్మి శాంకరి శిష్య బృందంచే నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. వినాయక కౌతం, పుష్పాంజలి, మూషిక వాహన, నారాయణతే నమో నమో, దశావతార శబ్దం, అయిగిరి నందిని, కృష్ణం కలయసఖి, జనుత షాబాన్, ఒకపరి కోకాప్రి, శ్రీమన్నారాయణ , జతిస్వరం, శివాష్టకం, శ్రీ విజ్ఞ రాజాం భజే అంశాలను అరుణ, అనఘా, కావ్య హిమబిందు, సృహ, తేజస్విని, సమీక్ష, తాన్యా, శరణ్య, హర్షివేద, హాన్విక, యశస్వి ప్రదర్శించి మెప్పించారు.






