రామచంద్రాపురం (నమస్తే శేరిలింగంపల్లి): రామచంద్రాపురం టీఆర్ఎస్ కార్పొరేటర్ బూరగడ్డ పుష్ప నగేష్ యాదవ్ కు శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పుష్ప నగేష్ యాదవ్‌ను కలిసిన ఆయన పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ టీఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షుడు దుర్గం వీరేశం గౌడ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, గోపాల్ యాదవ్, ఘనపురం రవీందర్, పట్లోళ్ల నర్సింహారెడ్డి, హరీష్, సాయి, చింతకింది రవీందర్ గౌడ్, మహేష్ ముదిరాజ్ పాల్గొన్నారు.






