చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని గంగారం శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి దంపతులు శనివారం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం ప్రధాన అర్చకుడు రంగాచార్య కార్పొరేటర్ దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో కార్పొరేటర్ గా గెలవడంతో శ్రీ భక్తాంజనేయ స్వామి మొక్కు తీర్చుకోవడం జరిగిందన్నారు. డివిజన్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ ఆంజనేయస్వామిని వేడుకున్నట్లుగా ఆమె తెలిపారు. ఆలయానికి కావల్సిన మౌలిక వసతులు కల్పిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఉరిటి వెంకట్ రావు, ధన లక్ష్మీ, సుప్రజా ప్రవీణ్ పాల్గొన్నారు.







