వివేకానందనగర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని వివేకానంద నగర్ డివిజన్‌లో ఉన్న పలు సమస్యలపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు కార్పొరేటర్ ఎం. లక్ష్మీబాయి వినతి పత్రం అందజేశారు. బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ క్లబ్ హౌజ్ లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్ ను కలిసి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ఆయనను కార్పొరేటర్ ఎం. లక్ష్మీబాయి కోరారు.