వివేకానందనగర్ (నమస్తే శేరిలింగంపల్లి): వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని పలు సమస్యలపై జోనల్ కమిషనర్ మమత కు కార్పొరేటర్ ఎం.లక్ష్మీబాయి, మాధవరం రామారావు లు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలోని అభివృద్ధి పనులను చేపట్టేందుకు నిధులను మంజూరు చేయాలని కోరారు. అలాగే పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసేలా చూడాలన్నారు. ఇందుకు స్పందించిన జోనల్ కమిషనర్ త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభమయ్యేలా ఆదేశిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ వార్డ్ కమిటీ సభ్యుడు వెంకటస్వామి సాగర్, యూత్ వింగ్ సూర్య ప్రతాప్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.