మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): భారీ వర్షాల కారణంగా మాదాపూర్ డివిజన్ పరిధిలోని అరుణోదయ కాలనీలో రహదారిపై ఏర్పడ్డ భారీ గుంతను కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ మంగళవారం సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ 30 ఫీట్ల మెయిన్ లైన్ సిపేజ్ అవడం వల్ల భారీ గుంత ఏర్పడిందని తెలిపారు. డ్రైనేజీకి మరమ్మత్తు నిర్వహిచి వెంటనే గుంతను పూడ్చేయిస్తామని తెలిపారు. అధికారులు పనులను వేగవంతం చేయాలని సూచించారు. అలాగే కాలనీలో యూజీడీ సమస్య ఉందని స్థానికులు తెలపగా కార్పొరేటర్ స్పందిస్తూ వెంటనే సమస్య పరిష్కరానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ ఏఈ ప్రశాంత్, తెరాస నాయకులు ఉన్నారు.