శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ తన జన్మదినం సందర్బంగా మనవడు అద్వైత్ గాంధీతో కలిసి ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు ఆరెకపూడి గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.