ఇజ్జ‌త్‌ నగర్ గ్రామంలో కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పాదయాత్ర

మాదాపూర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఇజ్జ‌త్‌ నగర్ గ్రామంలో జీహెచ్ఎంసీ ఈఈ చిన్నారెడ్డి, ఏఈ ప్రశాంత్, స్థానికులతో కలిసి కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ పాదయాత్ర నిర్వహించారు. ఇజ్జ‌త్ నగర్ వీకర్ సెక్షన్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఖానామెట్ మైనారిటీల శ్మ‌శానవాటికలను అభివృద్ధి చేయాలని స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఇజ్జ‌త్‌ నగర్ గ్రామంలో ఇప్పటికే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేశామని, సీసీ రోడ్డు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని, మంజూరైన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌస్, గంగల గణేష్ యాదవ్, శ్యామ్, బ్రహ్మ‌య్య యాదవ్, వార్డ్ సభ్యులు రామచందర్, లోకేష్, కృష్ణ తైలి, కృష్ణ నాయక్, షకీల్, అచ్య‌త్, ప్రవీణ్ యాదవ్, జి.మహేష్ యాదవ్, జీవీకే, వర్క్ ఇన్‌స్పెక్టర్ చారి, శర్మ పాల్గొన్నారు.

ఇజ్జ‌త్‌ నగర్ గ్రామంలో ప‌ర్య‌టిస్తున్న కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్
స్థానికుల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకుంటున్న కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here