ఘ‌నంగా ప్ర‌పంచ దివ్యాంగుల దినోత్స‌వం

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 3 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రజా పాలన విజయోత్సవాల సందర్భంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంను పురస్కరించుకుని హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT హిల్స్ కాలనీలో ఉన్న‌ కమ్యూనిటీ హాల్ లో జరిగిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం కార్యక్రమంలో భాగంగా కూకట్‌ప‌ల్లి సర్కిల్ పరిధిలోని ఆల్విన్ కాలనీ డివిజన్ ,హైదర్ నగర్, వివేకానంద నగర్, కూకట్‌ప‌ల్లి(పార్ట్) డివిజన్ల పరిధిలోని దివ్యాంగుల సాధికారిత కార్యక్రమంలో కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, మాధవరం రోజాదేవి రంగారావుల‌తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని విభిన్న ప్రతిభావంతులకు (దివ్యాంగులకు) ఉచిత ఉపకరణాలను, సహాయ పరికరాలను అందజేశారు.

కార్య‌క్ర‌మంలో మాట్లాడుతున్న PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజా పాలన విజయోత్సవాల సందర్భంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. దివ్యాంగులను సమాజంలో ఎటువంటి వివక్ష లేకుండా చూడాలని, సమానత్వంగా చూడాలని, సమాజంలో ప్రతి ఒక్కరినీ సమానంగా చూడాలని, దివ్యాంగులు ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్లాలని, వారు ఎంచుకున్న రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగుల‌కు ట్రై సైకిల్స్‌ను పంపిణీ చేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here