జయ నగర్ కాలనీలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ బ‌స్తీబాట

ఆల్విన్ కాల‌నీ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆల్విన్ కాల‌నీ డివిజ‌న్ ప‌రిధిలోని జ‌య‌న‌గ‌ర్‌లో ఆదివారం 17వ రోజు బ‌స్తీ బాట‌ను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేట‌ర్ దొడ్ల వెంక‌టేష్ గౌడ్ స్థానికంగా ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు.

జ‌య‌న‌గ‌ర్ కాల‌నీలో ప‌ర్య‌టిస్తున్న కార్పొరేట‌ర్ దొడ్ల వెంక‌టేష్ గౌడ్

కాలనీలో కొంత మేర రోడ్డు ప్యాచ్ వర్క్ పనులు, డ్రైనేజీ పనులు పూర్తి చేయాల్సి ఉందని కాలనీవాసులు కార్పొరేటర్ దృష్టికి తీసుకు వచ్చారు. స్పందించిన కార్పోరేటర్ వెంకటేష్ గౌడ్ ఇప్పటికే కాలనీలో అన్ని సమస్యలు పరిష్కరించామ‌ని, మిగిలిన కొంత భాగం కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు రామకృష్ణ గౌడ్, వార్డు సభ్యుడు కాశీనాథ్ యాదవ్, నాయకులు బోయ కిషన్, వాసు, యాదగిరి, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు వెంకట్ రెడ్డి, యాదగిరి గౌడ్, మల్లికార్జున్, లక్ష్మీ నాయుడు, సత్యనారాయణ, రాజ్ కుమార్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేట‌ర్ దొడ్ల వెంక‌టేష్ గౌడ్ కు విన‌తిప‌త్రం అంద‌జేస్తున్న స్థానికులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here