శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని సుదర్శన్ నగర్ కాలనీలో ఆదివారం కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యటించారు. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షంతో ఆయా కాలనీలకు చెందిన మురికి నీరు, వర్షపు నీరు సుదర్శన్ నగర్ కాలనీలోకి వచ్చి చేరడంతోపాటు కొన్ని ఇళ్లలోకి వర్షపు నీరు చేరిందన్న స్థానికుల ఫిర్యాదు మేరకు ఆదివారం కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ డీఈ శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు.
కాలనీలోని యూజీడీ లైన్ల నుంచి సామర్థ్యానికి మించి మురికి నీరు, వర్షపు నీరు ప్రవహించడంతో పొంగి రోడ్ల పైకి రావడం, ఇళ్లలోని మంచినీటి సంపు హౌజ్ లలోకి వస్తున్నాయని కాలనీ వాసులు వాపోయారు. సుదర్శన్ నగర్ కాలనీకి బయటి ప్రాంతం నుంచి ప్రధాన రహదారి గుండా పెద్ద పైపులైన్ వేసి అవుట్ లెట్ ఇచ్చేలా చూస్తామని, దీంతో సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్థానికులకు చెప్పారు. ఆయన వెంట అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు సుధాకర్, కోశాధికారి వెంకటయ్య, వెంకటేశం, బండప్ప, రాజేంద్రచారి, అమర్ సింగ్, శ్రీనివాస్ శర్మ, అరుణ్ తదితరులు ఉన్నారు.