ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): ఆత్మహత్య చేసుకున్న మహిళ అంత్యక్రియలకు ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆర్థిక సహాయం అందజేశారు. డివిజన్ పరిధిలోని శంషీగూడ ప్రాంతానికి చెందిన కాసాని కౌసల్య (39) కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ బుధవారం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియల నిమిత్తం రూ.10వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో యువ నాయకుడు రామకృష్ణ గౌడ్, వార్డ్ మెంబర్ కాశీనాథ్ యాదవ్, కాసాని శంకర్, వై. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.