నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో పెప్సికో అండ్ సీడ్స్ (సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకోలాజికల్ డెవలప్‌మెంట్ సొసైటీ), సొసైటీ ఫర్ రూరల్ డెవలప్ మెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాక్సినేషన్ సెంటర్ ను గురువారం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి, నార్సింగ్ మునిసిపల్ చైర్మన్ రేఖ యాదగిరి తో కలిసి ప్రారంభించారు. వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వాక్సిన్ తప్పని సరిగా వేసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం రాని వాళ్లకు ఈ వ్యాక్సినేషన్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ వెంకటేష్, తిరుపతి, సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజర్ ఇందిరా భారతి, సీనియర్ నాయకులు నర్సింగ్ నాయక్, హరీష్ శంకర్ యాదవ్, కిషన్ గౌలి, అనిల్, వెంకటేష్ ప్రకాష్, మన్నే రమేష్, రంగస్వామి, శ్రీకాంత్, బిక్షపతి,చిన్న, క్రాంతి, రాజు, శ్రీను, ప్రసాద్, నర్సింగ్ రావు, నరేష్, గొరక్, సాయిరాం, మధు, రుక్మాజి, గొరక్, గుండప్ప, సాయికిరణ్, అంబాజి, సాయిరాం, నరేష్ స్థానిక నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.