నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. నిమ్స్ దవఖానాలో శుక్రవారం స్థానిక నాయకులతో కలసి జగదీశ్వర్ గౌడ్ కోవాక్జీన్ టీకా తీయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో అపోహలు అవసరం లేదని అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రజలందరు ఎలాంటి భయాందోళనకు గురవ్వకుండా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని అన్నారు. వ్యాక్సిన్ తీసుకున్నాక సైతం మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతలో ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. జగదీశ్వర్ గౌడ్‌తో పాటు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో నాయకులు యాదగిరి గౌడ్, సునిల్, రాజు, గిరి, మనోజ్, అంజనేయులు, జగదీశ్ తదితరులున్నారు.

