శేరిలింగంపల్లి, నవంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని TGSPDCL సబ్ స్టేషన్ లో నిర్వహించిన విద్యుత్ వినియోగదారుల సదస్సులో SE రవికుమార్, DE జనప్రియ, ADE హరికృష్ణ, సంబంధిత విద్యుత్ అధికారులతో కలిసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యుత్ సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ పరిధిలోని మదీనాగూడ సబ్ స్టేషన్ లో నిర్వహించిన విద్యుత్ వినియోగదారుల సదస్సులో పాల్గొనడం జరిగిందని, మియాపూర్ డివిజన్ లోని పలు కాలనీలలో విద్యుత్ సరఫరా, కొత్త లైన్ ల ఏర్పాటు, కొత్తగా ఏర్పాటు చేవలసిన ట్రాన్స్‌ఫార్మార్ల సంఖ్యను పెంచవలసిందిగా, విరిగిన కరెంట్ స్తంభాలను మార్చవలసిందిగా విద్యుత్ అధికారులకు తెలియజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో TGSPDCL సంబంధిత అధికారులు AE లు రవిచంద్ర, శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






