ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్న కాంగ్రెస్‌కు త‌గిన గుణ‌పాఠం చెప్పాలి: కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 3 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే నాయకుడు లంకల దీపక్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాల‌ని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కోరారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా షేక్ పేట్ డివిజన్ లో బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన మహా పాదయాత్రలో రామగుండం నియోజకవర్గం బిజెపి కంటెస్టెడ్ ఎమ్మెల్యే కందుల సంధ్యా రాణి, రంగారెడ్డి అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడు రాధాకృష్ణ యాదవ్, జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ ముకేష్ గౌడ్, నాంపల్లి కంటెస్టెడ్ కార్పొరేటర్ కేశవ్ ల‌తో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుండి ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క పనీ కూడా చేయలేదని అన్నారు. ఆరు గ్యారెంటీ లు అని గద్దెనెక్కిన కాంగ్రెస్ ను గద్దె దించాలని ప్రజలను కోరారు. పదేళ్లు పాలించిన బిఆర్ఎస్ ది కూడా అదే పరిస్థితి అని ఆరోపించారు.హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూల్చి వేసి నానా ఇబ్బందులకు గురి చేసిన కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు శివసింగ్ రాందీన్, సీనియర్ నాయకులు వరలక్ష్మి ధీరజ్, తిరుపతి, రంగస్వామి , ప్రసాద్, మురుగ, రాజు, యాదయ్య, బూత్ అధ్యక్షుడు శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షులు, పోలింగ్ బూత్ ముఖ్య సబ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here