నమస్తే శేరిలింగంపల్లి: పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరల పెంపుతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం సీనియర్ నాయకులు జెరిపాటి జైపాల్ అన్నారు. ధరల పెంపును నిరసిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్లగండ్ల రమేష్ కుమార్ ఆధ్వర్యంలో మియాపూర్ ఎక్స్ రోడ్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం ధర్నా చేపట్టారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జెరిపాటి జైపాల్ మాట్లాడుతూ గ్యాస్, పెట్రోల్, డీజిల్, విద్యుత్ చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరల పెంచుతూ పన్నుల పేరుతో పేదోడి బ్రతుకును కాల రాస్తున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం కోఆర్డినేటర్ రఘునందన్ రెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎ-బ్లాక్ అధ్యక్షుడు యండి ఇలియాస్ షరీఫ్, ఆయా డివిజన్ల అధ్యక్షులు శ్రీనివాస్, జావీద్, మైనారిటీ నాయకుడు అయాజ్ ఖాన్, సీనియర్ నాయకులు అల్లా ఉద్దీన్, నర్సింహా గౌడ్, పోచయ్య, హరికిషన్, అజుమొద్దీన్, నియోజకవర్గం యాత్ కాంగ్రెస్ అధ్యక్షులు సౌందర్య రాజన్, యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోల్కొండ శేఖర్, దుర్గేష్, ఈశ్వర్, టీ.సురేష్ బాబు, మహిళా నాయకులు భారతమ్మ, శాంతి తదితరులు పాల్గొన్నారు.