టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి బిజెపిలోకి చేరికలు – పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి పట్ల ఆకర్షితులై పెద్ద ఎత్తున పార్టీలోకి చేరుతున్నారని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ అన్నారు. హఫీజ్ పేట్ డివిజన్ గంగారాం గ్రామానికి చెందిన టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున బిజెపిలోకి చేరారు.బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో తమ నాయకత్వాన్ని బలపరుస్తూ భారతీయ జనతా పార్టీలో చేరడంశుభపరిణామమని అన్నారు. గంగారం గ్రామం అంటే మాకు ప్రత్యేక అభిమానం‌ అన్నారు. గ్రామంలో ఏ సమస్య ఉన్నా పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఇచ్చిన హామీలను మరిచి ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని అన్నారు. వ్యాపారులతో కలిసి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడని, స్థలం కనపడితే భూ కబ్జాలు, ఆక్రమణలకు పాల్పడుతూ ఆయన అనుచరులకు దొరికినంత దోచిపెడుతున్నారని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే బిక్షపతి, స్వర్గీయులు పీజేఆర్ మార్గంలో నడుస్తూ ప్రజా సేవలో ముందుంటానని రవికుమార్ యాదవ్ చెప్పారు. ఈ సందర్భంగా బిజెపిలో చేరిన ఆయా పార్టీలకు చెందిన  శంకర్, నరసింహ, డి. కృష్ణ, అశోక్, స్వామి, బలియాలాల్, రమేష్, బాలకృష్ణ, సాయి, రాకేష్, అఖిల్, సురేష్, శుభాష్, సత్యనారాయణ, శ్రీను, డి. రమేష్, యాదయ్య, రాఘవేంద్ర, కౌశిక్, వెంకటేష్, సునీల్, అంజమ్మ, లక్ష్మీ, యాదమ్మ, సునీత, సంతోష, శ్రీలత, నవనీత, అఖిల , తనుజ, అనిత, భాగ్య తదితరులకు బిజెపి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎల్లేశ్, రమేష్, రాజేష్, ఇమ్రాన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

బిజెపి‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న రవికుమార్ యాదవ్

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here