ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై మాట నిలుపుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం: జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% సీట్లిచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌ని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియ‌జేస్తున్నామ‌ని శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. సమాజంలో అన్ని వర్గాలకు మేలు చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక ఆర్థిక సర్వేకు పూనుకుంద‌న్నారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించినందుకు డప్పులు కొట్టి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల గణన (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024) సర్వేకు జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ నివేదికలోని కీలకమైన మూడు అంశాలకు మంత్రిమండలిలో ఆమోదం ల‌భించింద‌న్నారు. శాసనసభలో ప్రకటన చేయ‌డం హ‌ర్ష‌ణీయ‌మ‌న్నారు. ఈ సంద‌ర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులతో కలిసి జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌ డాక్టర్.బాబా సాహెబ్ అంబేద్కర్, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చిత్రపటాల‌కి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఓసి, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు పెద్దఎత్తున పాల్గొన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డికి, మంత్రివర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కేసి వేణుగోపాల్, దీపాదాస్ మున్షీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ల‌కు, వివిధ పార్టీల ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎవరికీ వ్యతిరేకం కాద‌ని, అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నాకే, బడుగు బలహీన వర్గాలు సామాజిక ,రాజకీయ, ఉద్యోగాల్లో ఎదగాలని ఆకాంక్షించామ‌ని జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ అన్నారు.

ప్రజాపాలనకు నిదర్శనం కాంగ్రెస్ ప్రభుత్వం అని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తుందని, మాట ఇచ్చి చేసి చూపే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా, ప్రజలకు, మైనార్టీలకు, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటాం అని తెలిపారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో పెట్టిన విధంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కుల గణన సర్వే ద్వారా బడుగు బలహీన వర్గాలకు మేమెంతో మాకంత‌ అన్న విధంగా తెలంగాణ శాసనసభ కులగణన ఆమోదించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులు రాములు గౌడ్, బాలింగ్ యాదగిరి గౌడ్, వీరేందర్ గౌడ్,క నకమామిడి నరందేర్ గౌడ్, శేఖర్ ముదిరాజ్, మన్నెపల్లి సాంబశివరావు, ఉరిటీ వెంకట్ రావు, ప్రభాకర్ రెడ్డి, కట్ల శేఖర్ రెడ్డి, వల్లపు సురేందర్, రాజేందర్ గౌడ్, పట్వారీ శశిధర్, గఫర్, విజయభాస్కర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు బాష్పక యాదగిరి, శ్యామ్, కృష్ణ, శ్రీనివాస్ గౌడ్, జహంగీర్, యాదయ్య, రవి కుమార్, రామచందర్, యాలమంచి ఉదయ్ కిరణ్, సత్తి రెడ్డి, పద్మ రావు, నాయీమ్, రాజేష్, యాదగిరి, వెంకటేష్, హనుమంతు, జవీద్, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్, భరత్, బాలరాజు ముదిరాజ్, సత్యనారాయణ యాదవ్, కృష్ణ యాదవ్, అస్లాం, శివ గౌడ్, జగదీష్, నర్సింహ రాజు, జంగిర్, సురేష్ గౌడ్, కార్తిక్ గౌడ్, ఖాజా, గోపాల్ నాయక్, చంద్రమౌళి, శేరిలింగంపల్లి యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నితిన్ గౌడ్, ఆదిత్య ముదిరాజ్, మధు, వెంకటేష్ ముదిరాజ్, సునీత రెడ్డి, కల్పన ఏకాంత్ గౌడ్, లక్ష్మి, శిరీష సతుర్, జయ, శివాని, శాంత, సావిత్రి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here