శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 6 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ పోలీసులకు ఓ గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన ప్రకారం ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శేరిలింగంపల్లిలోని లింగంపల్లి రైల్వే స్టేషన్ 6వ ప్లాట్‌ఫామ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడి ఉందన్న సమాచారం అందుకున్న చందానగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా ఆ వ్యక్తి వయస్సు సుమారుగా 60 సంవత్సరాలు ఉంటుందని, బహుశా భిక్షాటన చేస్తూ ఉంటాడని, అతను చనిపోయేందుకు గల కారణాలు తెలియాల్సి ఉందని, ఎవరైనా గుర్తు పట్టదలిస్తే తమను సంప్రదించాలని సూచించారు.