శేరిలింగంపల్లి, అక్టోబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): శ్రీ వేంకటేశ్వర వేదాంతవర్ధినీ సంస్కృత కళాశాల విద్యార్థులు ఉమ్మడి శామీర్ పేటకు చెందిన క్రీడాకారులు శనివారం హైకోర్టు కాలనీ కమ్యూనిటీ గ్రౌండ్‌లో నిర్వహించిన టెన్నిస్ వాలీబాల్ సీనియర్ విభాగంలో రాష్ట్రస్థాయి ఎంపికలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. బీఏ 3వ సంవత్సరం విద్యార్థులు ఎస్ శివకృష్ణ, భీమ్ శంకర్ లు టెన్నిస్ వాలీబాల్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వారిని ప్రధానాచార్యులు డాక్టర్ బానోతు సురేందర్, కళాశాల అధ్యాపకులు, ఉపాధ్యాయులు, పి ఇ టి తదితరులు అభినందించారు.






