రేపు మాదాపూర్ డివిజ‌న్ లో అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు

ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

మాదాపూర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ డివిజ‌న్ ప‌రిధిలో ప‌లు ప్రాంతాల్లో రూ.10 కోట్ల 88 లక్షల 80 వేలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ లు గురువారం శంకుస్థాప‌న‌లు చేయ‌నున్నారు.

గోకుల్ ప్లాట్స్ లోని వివిధ కాలనీలలో రూ.214.00 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్లు, అంతర్గత రోడ్ల నిర్మాణ పనుల‌కు, మాతృ శ్రీ నగర్ లో రూ.23.00 లక్షల అంచనా వ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనుల‌కు, ఆదిత్య నగర్, సుభాష్ చంద్ర బోస్ నగర్ ల‌లో రూ.61.70 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్డు, సీసీ రోడ్ల పునరుద్ధరణ నిర్మాణ పనుల‌కు, శ్రీ బాగ్ కాలనీలో రూ.10.00 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే బీటీ రోడ్డు నిర్మాణ పనుల‌కు, ఘనశ్యామ్ సూపర్ మార్కెట్, సూర్య ఎలైట్, అపర్ణ రోడ్ వద్ద రూ.66.80 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే స్ట్రామ్ వాటర్ డ్రైన్ (వరద నీటి కాలువ), సీసీ రోడ్ల నిర్మాణ పనుల‌కు, శ్రావ్య ఆలయ, ఖానామెట్, గౌసియా కేఫ్ ల వ‌ద్ద రూ.96.00 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్డు పునరుద్ధరణ నిర్మాణ పనుల‌కు, ఇజ్జ‌త్ నగర్ లో రూ.31.00 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్లు, సీసీ రోడ్ల పునరుద్ధరణ నిర్మాణ పనుల‌కు, చంద్ర నాయక్ తండాలో రూ.33.40 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్లు, సీసీ రోడ్ల పునరుద్ధరణ నిర్మాణ పనుల‌కు, అరుణోదయ కాలనీ, జైహింద్ ఎన్‌క్లేవ్ వద్ద రూ.40.00 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్లు,

కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్

సీసీ రోడ్ల పునరుద్ధరణ నిర్మాణ పనుల‌కు, మాదాపూర్ విలేజ్ లో రూ.174.00 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే మాదాపూర్ విలేజ్ శ్మ‌శానవాటిక సుందరీకరణ పనుల‌కు, అయ్యప్ప సొసైటీ సీజేఆర్‌ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద రూ.98.00 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనుల‌కు, సాయినగర్ లో రూ.67.70 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్లు, సీసీ రోడ్ల పునరుద్ధరణ నిర్మాణ పనుల‌కు, కాకతీయ హిల్స్ లో రూ.90.50 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్లు, సీసీ రోడ్ల పునరుద్ధరణ నిర్మాణ పనుల‌కు, కావూరి హిల్స్ లో రూ.9.20 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే పార్కు అభివృద్ధి పనుల‌కు, వసంత్ సిటీ వద్ద రూ.21.00 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్ల పునరుద్ధరణ నిర్మాణ పనులకు వారు శంకుస్థాపనలు చేయనున్నారు.

 

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here