
చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): గంగారం పెద్ద చెరువు బఫర్ జోన్, నాళా, తూముల ఆక్రమణలపై ఇరిగేషన్ అధికారులు వెంటనే స్పందించి నివేదికను తయారు చేయాలని జనంకోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర రెడ్డి డిమాండ్ చేశారు. చందానగర్ పరిధిలోని గంగారం పెద్ద చెరువు 130 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, చెరువు యొక్క బఫర్ జోన్, నాలాలు, తూములు కబ్జాకు గురయ్యాయని జనం కోసం అక్టోబర్ 6వ తేదీన చేసిన ఫిర్యాదుపై చందానగర్ డిప్యూటీ కమీషనర్ సంధించి, ఆక్రమనలపై నివేదిక సమర్పిచాలని ఇర్రిగేషన్ ఈఈకి లేఖ రాశారని తెలిపారు.

సంబంధిత నివేదిక ఇవ్వడంలో ఇరిగేషన్ అధికారులు విఫలమైతే సదరు అక్రమణ ప్రాంతాల్లోని నిర్మాణాల అనుమతుల రద్దుతో పాటు తగిన చర్యలు తీసుకుంటామని తన లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. డీసీ లేఖపై ఇరిగేషన్ అధికారులు వెంటనే స్పందించి ఆక్రమనలపై నివేదిక వెంటనే అందించాలన్నారు. గంగారం పెద్ద చెరువు పరిసర కాలనీలు ముంపునకు గురి కాకుండా, నాళాలు, బఫర్ జోన్, తూములు పునరుద్ధరించాలని, ఆక్రమణ స్థలాల్లో ఇచ్చిన అనుమతులను రద్దు చేసి, ఆక్రమణలను వెంటనే తొలగించాలని జనం కోసం సంస్థ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు.