శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): ఆపదలో ఉన్నవారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఆపన్న హస్తం అందిస్తుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు బాధితులు ఆసుపత్రి బిల్లుల పరిహారార్ధం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా ముఖ్య మంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబాలకి ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. నియోజకవర్గం పరిధిలోని 26 మందికి రూ.13,15,600 విలువైన ఎల్‌వోసీ పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ప్రజాక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారిని ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని అన్నారు. అనారోగ్యానికి గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిరుపేదలకు, అభాగ్యులకు అండగా ఎం సహాయ నిధి ఆర్థిక భరోసానిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు బ్రిక్ శ్రీను, ఉట్ల చంద్రా రెడ్డి, దావులూరి సాంబశివరావు, తిరుపతి, రజినీకాంత్, కనక రెడ్డి పాల్గొన్నారు.
