మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): ముస్లిం పిల్లలకు చక్కటి విద్యాబుద్ధులు నేర్పిస్తూ మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో మదరసాలు ఎంతగానో దోహదపడుతున్నాయని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ తరపున విజయఢంకా మోగించిన కార్పొరేటర్లను మదీనాగూడ మదరసా ఇస్లామియా గుల్జార్ – ఈ – మదీనా ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఘనంగా సన్మానించారు. గ్రేటర్ ఎన్నికల్లో ముస్లింల సహకారంతో టీఆర్ఎస్ పార్టీ తరపున కార్పొరేటర్లుగా విజయం సాధించారన్నారు.

భవిష్యత్తులో మనమంతా ఒక కుటుంబంలా ఉండాలని, తమ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు. మదరసా అభివృద్ధికి తామంతా కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఇటీవల గెలిచిన కార్పొరేటర్లు మాట్లాడుతూ ఎన్నికల్లో తమ విజయానికి సహకరించిన ముస్లింలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. మైనార్టీల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తోందన్నారు. గత 25 ఏళ్లుగా పేద మైనార్టీల పిల్లలకు ఉన్నత విద్యనందించడంలో మదరసాల కృషి అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి, మాదాపూర్, కొండాపూర్, మియాపూర్, చందానగర్ డివిజన్ల కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, హమీద్ పటేల్, ఉప్పలపాటి శ్రీకాంత్, మంజులరఘునాథ్ రెడ్డి, అబీబ్ సహబ్, అన్వర్ షరీఫ్, మహమ్మద్ షరీఫ్, నిర్వాహకులు సయ్యద్ మిస్భ, సయ్యద్ అంజాద్ మొయినుద్దీన్, సయ్యద్ తయ్యార్ హుస్సేన్, యూసుఫ్ జానీ, ముస్తాకిన్, సయ్యద్ అబ్దుల్ కలాం, టిఆర్ఎస్ నాయకులు వాలా హరీష్ రావు, మనోహర్ గౌడ్, వీరేశం గౌడ్, బాలరాజు యాదవ్, యాదగిరి, ఆంజనేయులు, శ్రీనివాస్ గౌడ్, అక్తర్, అక్బర్, సురేష్, రాంబాబు, విష్ణు, సాయి యాదవ్, నవీన్ యాదవ్ పాల్గొన్నారు.