అన్ని ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి బీసీలు స‌త్తా చాటాలి: భేరి రామచందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, నవంబ‌ర్ 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ నేటి తరం యువ రాజకీయ నాయకులకు ఆదర్శం అని తెలంగాణ రాష్ట్ర బీసీ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా బిల్డర్ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలో రహమత్ నగర్, బోర‌బండ, రాజీవ్ నగర్ ప్రాంతాల బీసీ నాయకులు జూబ్లీహిల్స్‌లో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర గొర్రెల సంఘం మాజీ చైర్మన్ రాజయ్య యాదవ్, సంగారెడ్డి జిల్లా యాదవ్ సంఘం అధ్యక్షుడు పెరుగు ఐలేష్ యాదవ్, అందెల కుమార్ యాదవ్, ముదిరాజ్ సంఘం నాయకుడు శంకర్ ముదిరాజ్, బీసీ నాయకులు పాములేటి యాదవ్, సుబ్బయ్య యాదవ్, ఇతర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఉప ఎన్నికలో విజయం సాధించినందుకు బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ నాయకులు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ను సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఎన్నికలో భారీ మెజారిటీతో గెలవడానికి బీసీ నినాదమే కారణమని అన్నారు. యువ రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ బీసీల ఐక్యత వల్లే ఈ విజయం సాధ్యమైందని, నేటి తరం రాజకీయ నాయకులు ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరో యువ బీసీ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ స్థానం సంపాదించారని ఆయన అన్నారు. భవిష్యత్తులో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్ ఎన్నికల్లో పోటీ చేసి తమ సత్తా చాటాలని బీసీలకు బేరి రామచందర్ యాదవ్ పిలుపునిచ్చారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here