- కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): ప్రతి ఒక్కరూ శుభ్రంగా ఉన్న నీటినే తాగాలని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలోని పీజేఆర్ స్టేడియంలో సేఫ్ వాటర్ నెట్‌వర్క్, హనీ వెల్, యూఎస్ఎయిడ్ సేఫ్ వాటర్ హ్యాండ్ వాషింగ్ పై జీహెచ్ఎంసీ కార్మికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అందులో పాల్గొన్న కార్పొరేటర్ నవత రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన నీటిని తాగాలని అన్నారు. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని తెలిపారు. అపరిశుభ్రంగా ఉంటే కలిగే సమస్యలపై ఆమె వివరించారు. అనంతరం శుభ్రతపై రూపొందించిన కరపత్రాలను ఆమె ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సేఫ్ వాటర్ సంస్థ ప్రతినిధులు వేణు, రాధిక, రమణ కుమారి, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.