చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డ్ చైర్ పర్సన్, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రాగం సుజాతయాదవ్ జన్మదినం సందర్భంగా మహాసభ జిల్లా అధ్యక్షుడు భేరి రాంచందర్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో రాగం సుజాత యాదవ్ మరెన్నొ ఉన్నత పదవులు అదిరోహించాలని, ఆయురారొగ్య ఐశ్వర్యాలతో నూరేళ్లు వర్ధిల్లాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్టు భేరి రాంచందర్ యాదవ్ పేర్కొన్నారు.