నమస్తే శేరిలింగంపల్లి: మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకోవాలని వివేకానందనగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జి.నరసింహారెడ్డి అన్నారు. వివేకానంద నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివిధ రసాయన లతో తయారుచేసిన వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా కలుషిత వాతావరణం ఏర్పడుతుందన్నారు. కాలుష్యం బారి నుండి రక్షించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని అన్నారు. మట్టి వినాయక ప్రతిమలను పూజించి భావితరాలకు మంచి వాతావరణం ఇవ్వాలని అన్నారు. వినాయక నవరాత్రులను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రశాంతంగా జరుపుకోవాలని ప్రజలకు నరసింహారెడ్డి విజ్ఞప్తి చేశారు.