నమస్తే శేరిలింగంపల్లి: భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని హోప్ ఫౌండేషన్ చైర్మెన్ కొండ విజయ్ కుమార్ పేర్కొన్నారు. హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చందానగర్ హుడాకాలనీలో మట్టి వినాయకులను పంపీణీ చేశారు. ఈ సందర్భంగా కొండా విజయ్ మాట్లాడుతూ హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా మట్టి వినాయకుల పంపీణీ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం తమ హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3 వేల వినాయక ప్రతిమలను పంపీణీ చేయనున్నట్లు కొండా విజయ్ కుమార్ పేర్కొన్నారు. మట్టి వినాయకుల ప్రతిమలు కావాల్సిన వారు 9959345643 నంబర్ ను సంప్రదించవచ్చని తెలిపారు.
