నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ లోని మక్తా లో నూతనంగా ఏర్పాటు చేసిన టైలర్ షాప్ ను బిజెపి నాయకులు గుండె గణేష్ ముదిరాజ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ లో ఉన్న పోటీని తట్టుకుని మంచి పేరు తెచ్చుకోవాలని నిర్వాహుకులకు సూచించారు. యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వశక్తితో సొంతంగా వ్యాపారాలు చేసుకుంటూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కోరారు. టైలరింగ్ లో వచ్చే మార్పులకనుగుణంగా మెళుకువలు, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ముందుకు సాగాలని సూచించారు. లేడీస్ అండ్ జెంట్స్, పాల్స్, పీకో వర్క్స్ వంటి అన్ని రకాల దుస్తులు కుట్టనున్నట్లు టైలరింగ్ నిర్వాహకులు కోటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాము, రాజేందర్ ఉన్నారు.