నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని ఇంద్ర నగర్, సిటిజన్ కాలనిలలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డీ ప్రభుత్వం తరపున ముస్లిం సోదరులకు రంజాన్ కానుకను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మైనారిటీలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. వారి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. నీరుపేద ప్రజలకు అండగా ఉండాలని షాదిముబారక్, రంజాన్ తోఫా పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పేట్టడం జరిగిందన్నారు. కరోనా వేంటాడుడుతున్న ప్రజలు పండగను సంతోషంగా జరుపుకోవాలన్న ఆకాంక్షతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తేన్నారని తెలిపారు. పేద, ధనిక తారతమ్యాలు లేకుండా అందరూ పండుగలను అంతే సంతోషంగా జరుపుకోవాలని ప్రభుత్వం రంజాన్ తోఫా పంపిణీ ప్రారంభిందన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రంజాన్ పర్వదినాలను సంతోషంగా జరుపుకోవాలని ముస్లిం సోదరులకు ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథరెడ్డి, టిఆర్ఎస్ మైనారిటీ నాయకులు అక్బర్ ఖాన్, మెయినోద్దిన్, నిజాం, మెయిజ్, అంజద్, అహ్మద్ పాషా, అల్తాఫ్, సల్మాన్, సలిం, ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు.






