శేరిలింగంపల్లి, డిసెంబర్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ పీజేఆర్ నగర్ క్రీస్తు అపొస్తులీక్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాండ్ క్రిస్మస్ వేడుకలకు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై పాస్టర్లు, స్థానిక నాయకులతో కలిసి కేక్ కట్ చేసి క్రిస్టియన్లకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ లోక రక్షకుడు, కరుణామయుడు ఏసుక్రీస్తు పుట్టిన పవిత్రమైన రోజున జరుపుకునే క్రిస్మస్ పండుగ అందరూ ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ లోని ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా అన్ని పండుగలు కలిసిమెలిసి చేసుకోవడం ఆనందించదగ్గ విషయం అని అన్నారు. డివిజన్ ప్రజలందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయుకులు, చర్చ్ పాస్టర్లు, క్రిస్టియన్ లు తదితరులు పాల్గొన్నారు.






