శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): భారతీయ జనత పార్టీ రంగారెడ్డి (అర్భన్) జిల్లా ప్రధాన కార్యదర్శిగా శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన చింతకింది గోవర్ధన్ గౌడ్ నియమితులయ్యారు. బాల్యం నుండి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యుడిగా, హిందు వాహినీ శేరిలింగంపల్లి ప్రధాన కార్యదర్శిగా, భారతీయ జనత పార్టీలో శేరిలింగంపల్లి మండల ప్రధాన కార్యదర్శిగా రెండు పర్యాయాలు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కో కన్వీనర్‌గా, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడిగా, రంగారెడ్డి జిల్లా బిజెపి ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడిగా భాద్యతలు నిర్వర్తించి పార్టీకీ విశేషసేవలందించిన చింతకింది గోవర్ధన్ గౌడ్‌కు జిల్లా కమిటీలో ప్రధాన కార్యదర్శిగా గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకముంచి బాధ్యతలు అప్పగించిన జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, అందుకు సహకరించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సంఘటన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ నందకుమార్ యాదవ్, రాష్ట్ర నాయకులు మొవ్వా సత్యనారాయణ, బాల్ద అశోక్, అసెంబ్లీ ఇంచార్జ్ గజ్జల యోగానంద్‌లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి జిల్లాలో పార్టీ అభివృద్ధి కోసం కృషిచేస్తానని, ప్రజా సమస్యల పరిష్యల పరిష్కారం కోసం తనవంతు భాద్యత పోషిస్తానని అన్నారు.