జ్యోతిష్య నిపుణులు చంద్రశేఖర శాస్త్రికి డాక్టరేట్ ప్రధానం

నమస్తే శేరిలింగంపల్లి: సైంటిఫిక్ వాస్తు, జ్యోతిష్య నిపుణులు, శేరిలింగంపల్లి మండలం గోపీనగర్ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ చంద్రశేఖర శాస్త్రికి డాక్టరేట్ పట్టా లభించింది. తమిళనాడు రాష్ట్రంలోని హోసుర్ పట్టణంలో ఏసియా వైదిక్ కల్చర్ రిసెర్చ్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో ఈ నెల 28న నిర్వహించిన కార్యక్రమంలో చంద్రశేఖర శాస్త్రి గౌరవ డాక్టరేట్ పట్టాను అందుకున్నారు.

తమిళనాడులో డాక్టరేట్ పట్టాను అందుకుంటున్న చంద్రశేఖర శాస్త్రి

ప్రముఖ సైంటిఫిక్ వాస్తు, జ్యోతిష్య నిపుణులు, పురోహిత బ్రహ్మ, జ్యోతిష్య శిరోమణి బిరుదాంకితులుగా పేరొందిన చంద్రశేఖర శాస్త్రి జ్యోతిష్యం ద్వారా పలువురికి ఎన్నో రోగాలను నయం చేయడం, భూగర్భ దోషాలను నివారించి ఎంతో మందికి ఆరోగ్యాన్ని అందించిన ఘనత చంద్రశేఖర శాస్త్రి దక్కింది. వందలాది ప్రతిష్టాపనలు, వేలాది వివాహాలు చేసిన అనుభవం చంద్రశేఖర్ శాస్త్రి గలదు. వివాహం కాని వారికి, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని బాగుచేయడం లాంటివి చేస్తుంటారు.‌ ఆయన చేసిన సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేశారు. తనకు ఈ డాక్టరేట్ లభించడం సంతోషంగా ఉందని చంద్రశేఖర శాస్త్రి వెల్లడించారు.

డాక్టరేట్ పట్టాను అందుకున్న బ్రహ్మశ్రీ చంద్రశేఖర శాస్త్రి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here