చందానగర్ పోస్ట్ ఆఫీస్ కొత్త ప్రాంగణంలోకి మార్పు

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 4 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ పోస్ట్ ఆఫీస్ కొత్త ప్రాంగణంలోకి మారింది. పీజేఆర్ స్టేడియం లేన్ లో ఉన్న కార్యాలయం తాజాగా హుడా కాలనీ ప్రధాన రహదారిలోని సాయిదీప హాస్పిటల్ ఎదురుగా అమైరా ఎన్‌క్లేవ్ భవనంలోని మొదటి అంతస్తు ప్లాట్ నంబర్ 101 లోకి మారింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పోస్టల్ ఇండియా సికింద్రాబాద్ డివిజన్ సూపరింటెండెంట్ అనన్య ప్రియ మాట్లాడుతూ వినియోగదారుల సౌకర్యార్థం విశాల ప్రాంగణంలోకి పోస్టల్ కార్యాలయాన్ని మార్చినట్టు తెలిపారు.

చందానగర్ కొత్త పోస్ట్ ఆఫీస్ ఇదే

చందానగర్పరిసర ప్రాంతాల ప్రజలు పోస్టల్ సేవలను విరివిగా ఉపయోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఇక్కడ సుకన్య సమృద్ధి యోజన, PPF, Mis SB/RD, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, ప్రమాద బీమా, లైఫ్ సర్టిఫికెట్, ఆధార్ సేవలు అందుబాటులో ఉంటాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో Aspo సాగర్ దండప్ప, చందానగర్ పోస్ట్ మాస్టర్ వెంకట్ గౌడ్, కార్యాలయ సిబ్బంది, స్థానిక నాయకులు, వినియోగదారులు పాల్గొన్నారు.

పోస్టల్ ఇండియా సికింద్రాబాద్ డివిజన్ సూపరింటెండెంట్ అనన్య ప్రియ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here