- చందానగర్, మియాపూర్ పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో లాక్‌డౌన్ తీరును పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు
నమస్తే శేరిలింగంపల్లి: లాక్‌డౌన్‌లో మినహాయింపు నాలుగు గంటల సమయంలో కరివేపాకు అంటూ, పాలు అంటూ పదిసార్లు బయటకు రావడం ఇతరులకు శ్రేయస్కరం కాదని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. లాక్‌డౌన్ పరిస్థితుల పరిశీలనలో భాగంగా సజ్జనార్ గురువారం చందానగర్, మియాపూర్ పోలీస్‌స్టేషన్‌ల పరిధిలోని అనేక ప్రాంతాల్లో పర్యటించారు. వాహనదారులను స్వయంగా ఆపి ఆయన వివరాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ కరోనా ఉదృతిని కట్టడి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిందని, తాజాగా ఈనెల 30 వరకు లాక్‌డౌన్‌ను పొడగిస్తూ సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయాన్ని ప్రజలందరు గుర్తెరగాలని అన్నారు. సైబరాబాద్ పరిధిలో మొత్తం 75 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని, 5 వేల మంది సిబ్బందితో విధులు నిర్వహిస్తున్నామని అన్నారు. నిత్యావసరాల కోసం లాక్‌డౌన్‌లో 4 గంటలు మినహాయింపు ఇచ్చారని, ఐతే కొందరు ఆ నాలుగు గంటల్లో మాటిమాటికి బయటకు రావడం గమనించడం జరుగుతుందని అన్నారు. చిన్న చిన్న వస్తువుల కోసం బయటకు రాకుండా వచ్చిన ఒకేసారి నాలుగు రోజులకు సరిపడా సరుకులు తీసుకువెళ్లాలని సూచించారు. వైరస్‌ను కట్టడి చేయాలంటే ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలని, పోలీసుల విధులకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్, సీఏఆర్ అడిషనల్ డీసీపీ మాణిక్‌రాజ్, ఏసీపీలు కృష్ణ ప్రసాద్, చంద్రశేఖర్, ఇన్‌స్పెక్టర్లు క్యాస్ట్రో, సామల వెంకటేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
అన్న మరి కొన్ని అత్యవసర పరది మినహాయించి కొన్ని వ్యాపార సంస్థలు రోజు 6.30 నుoడి 9.30 వరకు తీయడం జరుగుతుంది. మరి వారు టైం తో పోటీపడి వస్తు పోతున్నారు.. ఆ తొందరలో జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది… కానీ ఒక వైపు సమయం తో పోటీ & మరోవైపున జాగ్రత్త చర్యలు సాధ్యం చాల కష్టం కదా అన్న””!
మీ అభిప్రాయం / సలహా మేరకు దీనిపై ఒక ఆర్టికల్ మీరు రాయగలరు…