నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ బుదవారం ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలశారు. డివిజన్లోని అభివృద్ధి పనులకు పెద్దమొత్తంలో నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఉప్పలపాటి శ్రీకాంత్ వారి క్యాంపు కార్యాలయంలో గాంధీకి వినతీ పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన గాంధీ ప్రాధాన్యత క్రమంలో నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.