నమస్తే శేరిలింగంపల్లి: కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో అధికారులతో కలిసి స్థానిక కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పర్యటించారు. దీప్తిశ్రీ నగర్, శాంతినగర్ కాలనీలలోని నాలాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగింపజేశారు. ఈ సందర్భంగా చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల అధికారులు ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. అత్యవసరమైతే తప్పా ప్రజలకు బయటికి రావాలన్నారు. రహదారులపై వరద నీరు ఆగకుండా చూడాలన్నారు. మ్యాన్ హోల్స్ వద్ద సూచీ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, చందానగర్ మున్సిపల్ కమిషనర్ సుధాంశ్, ఈఈ శ్రీకాంతి, డీఈ స్రవంతి, ఏఈ శివ ప్రసాద్, వర్క్ ఇన్‌స్పెక్టర్ హరీష్, కాలనీ వాసులు వెంకటేశ్వర రావు, శ్రీనివాస్, బబ్లూ, చంద్రమౌళి, హనుమంతరావు, భాస్కర రావు,కవి తదితరులు పాల్గొన్నారు.